శ్రీకాకుళం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్‌ను తొలిసారి విజయం వరించింది. శ్రీకాకుళం మండలం కిష్టప్పపేట సర్పంచ్, సర్పంచ్ల సంఘం జిల్లా అధ్యక్షుడు గొండు శంకర్.. శ్రీకాకుళం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. మంత్రి ధర్మాన ప్రసాదరావును ఓడించారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. శంకర్ తొలిరౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించారు. గార మండలంలో ధర్మాన ప్రసాదరావుకు మెజార్టీ ఓట్లు భావించారు. కాగా.. తొలి రౌండు లెక్కింపులోనే గార మండలంలో గొండు శంకర్ 9వేలకుపైగా మెజార్టీ సాధించారు. దీంతో ధర్మాన ఓటమి లాంఛనమేనని పార్టీ శ్రేణులు ఒక నిర్ణయానికి వచ్చేశాయి. చివరకు జిల్లాలోనే అత్యధికంగా 52,521 ఓట్ల భారీ మెజార్టీతో.. గొండు శంకర్ గెలుపొందడంతో ధర్మానకు తేలుకోలేని షాక్ ఇచ్చినట్టయింది.