ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జూన్-09న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు తేదీ మారిందని వార్తలు గుప్పుమంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్-12న ‘ నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ప్రమాణం ఉంటుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే.. జూన్-09న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేయబోతున్నారని సమాచారం. అందుకే ఆ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంటుందని.. వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఏడో తారీఖున ప్రమాణంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa