మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాపతి విజయ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పిన్నెల్లి వ్యాజ్యాలను విచారించేందుకు తగినంత సమయం లేకపోవడం, అప్పటికే రాత్రి 10.30 గంటలు కావడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa