తిరుపతి జిల్లా చియ్యవరం గ్రామానికి చెందిన శ్రీరాములు(24) వైయస్ఆర్‌సీపీకి వీరాభిమాని. ఆయన తన తల్లి పోలమ్మతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. ఈ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ ఓటమి పాలవడం, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్‌రెడ్డికి విజయం లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై అన్నం తినడం మానేశాడు. తల్లి ఎంత బతిమాలినా మెతుకు ముట్టలేదు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa