తెల్లవారుజామున కావడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు నిద్ర మత్తు ఆవహించిందో లేదంటే మరో కారణమో కానీ నెల్లూరు జిల్లా, కావలి మద్దూరుపాడు వద్ద లారీనీ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోల్‌కతా - చెన్నై జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు గిద్దలూరు నుంచి చెన్నై వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న తల్లం లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులకి తీవ్ర గాయాలయ్యాయి.