నైరుతి రుతు పవనాలు కర్ణాటక, దక్షిణ మహారాష్ట్రతోపాటు తెలంగాణ, ఉత్తరాంధ్ర సహా మరికొన్ని ప్రాంతాలు ముందుకు సాగుతున్నాయి. రాయలసీమలో ఆవర్తనం విస్తరించి ఉంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర తప్ప మిగిలిన చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఉరుములతో కూడిన వర్షం కురిసే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ఉరుములు పడే సమయంలో చెట్లు, పోల్స్, టవర్ కింద, బహిరంగ ప్రదేశాల్లో జనం ఉండొద్దని కోరారు. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతోపాటు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.