తాను ఎంపీగా ఉండగా.. జగన్ తన సలహాలు పాటించారని బీజేపీ నేత, మాజీ ఎంపీ వరప్రసాద్ తెలిపారు. సీఎంగా గెలుచిన తరువాత జగన్ బాగా మారిపోయారన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో ధనంజయరెడ్డి, విజయసాయిరెడ్డి, సజ్జల, మిథున్ రెడ్డి వల్లనే వైసీపీని వీడాల్సి వచ్చిందన్నారు. వైసీపీలో సొంత పార్టీ వారిపై కేసులు పెట్టించిన ఘనత సజ్జలదేనని పేర్కొన్నారు. సిలికా, ఇసుకా అక్రమ రవాణాను అడ్డుకోవడం వారికి తప్పుగా కన్పించిందని వరప్రసాద్ తెలిపారు. రిటైర్ ఐఏఎస్ అధికారిగా తనకు పాలనపై అవగాహన ఉందన్నారు. అక్రమాలను అడ్డుకున్న కారణంగా వైసీపీలో టిక్కెట్ దక్కుతుందని భావించలేదన్నారు.