వైయస్ఆర్పై జరుగుతున్న దాడుల పై హైకోర్టుకు వెళ్తామని మాజీ మంత్రి కొడాలి నానిపేర్కొన్నారు. దాడులు చేసిన వారితో పాటు. చూస్తూ ఉన్న పోలీసులపై కేసులు వేస్తాం. రాబోయే రెండు రోజుల్లో కృష్ణాజిల్లాలో పర్యటిస్తాం. ప్రతి నియోజకవర్గంలో దాడులకు గురైనవారి ఇళ్లకు వెళ్లి వారికి అండగా నిలుస్తాం అని ప్రకటించారు. కౌంటింగ్ అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు వైయస్ఆర్సీపీ నేతలపై ఉద్దేశ పూర్వకంగా దాడులు చేస్తున్నారని పేర్కొన్నారు.. ఇళ్లు, కార్లు ద్వంసం చేసి దాడులు చేస్తున్నారు.. వైయస్ఆర్సీపీ నేతలను, క్యాడర్ ను భయభ్రాంతులకు గురి చేసే విధంగా దాడులు జరుగుతున్నాయని.. ఈ దాడులకు పోలీసులు దగ్గర ఉండి చేయిస్తున్నారని విమర్శించారు. దాడులు జరుగుతుంటే.. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు.. టీడీపీ అల్లరి మూకల మీద పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టులో కేసులు వేస్తామని పేర్కొన్నారు.