ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిలాఫలకం కూల్చివేతపై మార్గాని భరత్ స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 03:35 PM

వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై టీడీపీ నేతలు దాడులు చేయడం దారుణమని  మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోరంపూడి ఫ్లై ఓవర్‌ శిలాఫలాకాన్ని టీడీపీ శ్రేణులు కూల్చేశారని ధ్వజమెత్తారు. రాజమండ్రిని సొంత ఇల్లులా భావించాను. సొంత కార్యక్రమాలకు, వ్యాపారాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జనం మధ్యలోనే గడిపాను. ఎంతోమంది నాయకులు ఎంపీలు, మేయర్లు అయ్యారు. రాజమండ్రిలో ఈ తరహా అభివృద్ధి ఎప్పుడు జరగలేదు. రాజమండ్రిలో మోరంపూడి శిలా ఫలాకాన్ని టీడీపీ నేతలు కూల్చేసినా ఎమ్మెల్యే వ్యంగ్యంగా మాట్లాడటం దారుణం. శిలాఫలకం కూల్చేసి క్రమశిక్షణకు మారుపేరని చెప్పటం ఎంతవరకు కరెక్ట్. అమరావతి రైతులు నిజమైన రైతులు కాదు.. రైతుల రూపంలో ఉన్న టీడీపీ మూకలు రాజమండ్రిలో మాపై దాడి చేశారు. దానిని మాత్రమే ప్రతిఘటించామ‌ని మార్గాని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com