కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదో.. మళ్లీ అన్న క్యాంటీన్లకు కళొస్తుంది. గత ఐదేళ్లుగా అన్న క్యాంటిన్లు మూతపడి ఉన్నా యి.. వైసీపీ నాయకులు అన్న క్యాంటిన్ భవనాలను నిరుపయోగంగా మార్చేశారు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో అన్న క్యాం టిన్లు తెరిచేందుకు నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అన్న క్యాంటిన్‌ను ఆదివారం ప్రారంభిస్తున్నట్టు కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమణి రామకృష్ణారావు, జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో మూసివేసిన అన్న క్యాంటిన్‌ను గత రెండు రోజులుగా టీడీపీ నాయకులు శుభ్రం చేయిస్తున్నారు.దీనిలో భాగంగా శనివారం పరిశీలించారు. ఆదివారం ఉదయం 11 గంటలకు అన్న క్యాంటిన్‌ను పునః ప్రారంభిస్తున్నామన్నారు. ప్రభుత్వం అధికారికంగా అన్న క్యాంటిన్‌ను ప్రారంభించే వరకు కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ నాయకులంతా కలిసి నిర్వహణ బాధ్యతలు చేపడతామన్నారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు దాయన రామకృష్ణ, సూరపనేని చిన్ని, పొట్రు శ్రీనివాసరావు, మద్దిపాటి సత్యనారాయణ, సూర్యదేవర రంజిత్. తోరం నగేష్, కురుకూరి బుజ్జి, గెల్లా సురేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.