కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీ కీలక నేత గిరినాథ్ చౌదరిని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హత్య చేసారు.వేట కొడవళ్లతో నరికి చంపేశాయి. ఈ ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించబోమని హెచ్చరించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పై స్థాయి అధికారులు తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. టీడీపీ నేతల డిమాండ్‌తో కర్నూలు జిల్లా పోలీసులు విచారణ చేపట్టి వారికి హామీని ఇవ్వడంతో ఆందోళన విరమించారు.