కేంద్రమంత్రులుగా శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్.. ఢిల్లీలో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనుండడంతో వారిపై టీడీపీ, జనసేన, భాజపా కూటమి నేతలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కూటమిలో జోష్ నిండింది. ఇప్పటికే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఎంపీలు కుటుంబ సభ్యులతో సహా ఢిల్లీ చేరుకున్నారు. మరో వైపు చంద్రబాబు సైతం ఢిల్లీకి బయలుదేరారు.