పౌర విమానయాన శాఖ తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ..యువకుడివి, విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది.. కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa