తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు నిధులు విడుదల చేసింది. జూన్ నెలలో ట్యాక్స్ డెవల్యూషన్‌లో భాగంగా కేంద్రం ఏపీకి రూ. 5వేల కోట్లు రిలీజ్ చేసింది. మరో ఇన్‌స్టాల్‌మెంట్‌ను కూడా కేంద్రం ఈ మొత్తాన్ని జమ చేసింది.. రాష్ట్రంలో నిలిచిపోయిన అభివృద్ధి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, మూల ధన వ్యయాల కోసం ఈ నిధులు ఉపయోగపడతాయంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌తో సహా మిగిలిన రాష్ట్రాలన్నింటికీ కలిపి రూ.1,39,750 కోట్లు విడుదల చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25) మధ్యంతర బడ్జెట్‌లో రాష్ట్రాలకు పన్నుల రూపంలో చెల్లించాల్సిన మొత్తం 12,19,783 కోట్లు కాగా.. అందులో భాగంగా ఈ నిధులు విడుదల చేశారు. ఇందలో ఏపీ వాటాగా రూ.5,655.72 కోట్లు మంజూరు చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌కు రూ.2,455.44, అసోంకు రూ. 4,371.38, బీహార్- రూ. 14,056.12 కోట్లు, ఛత్తీస్‌గఢ్- రూ. 4,761.30 కోట్లు, గోవా- రూ.539.42 కోట్లు, గుజరాత్- రూ.4,860.56 కోట్లు, హర్యానా-రూ.1,527.48 కోట్లు, హిమాచల్ ప్రదేశ్- రూ. 1,159.92 కోట్లు విడుదల అయ్యాయి.