ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక ప్రాంతాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని, ఆయా ప్రాంతాల్లో శాశ్వత నీటి పథకాలను అమలుపరచి సమస్య పరిష్కరించాలని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కోరారు. మంగళవారం ఒంగోలులో కలెక్టర్ దినేష్ కుమార్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై ఆయన కలెక్టర్ తో చర్చించి, 14 నెలల బిల్లులు విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.