రాష్ట్రవ్యాప్తం గా ఉన్న ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీకోసం మే 16 నుంచి 23 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఏపీఈఏపీసెట్ ప్రవేశపరీక్షా ఫలితాలను మంగళవారం విజయవాడలో రాష్ట్ర ఉన్న త విద్య ప్రధాన కార్యదర్శి జె.శ్యామలరావు విడుదలచేసినట్లు సెట్ చైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. కాకినాడ జిల్లాలో మూడు కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు ఇంజనీరింగ్ విభాగంలో 4,437మంది బాలురు హాజరు కాగా3,412మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 3,869 మందికిగాను 3083మంది ఉత్తీర్ణత సాధించారన్నారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో జిల్లాలో 715మంది బాలురు హాజరుకాగా 612మంది, 2621మంది బాలికలు హాజరుకాగా 2261 మంది ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 6,459మంది విద్యార్ధులు ఇంజనీరింగ్ విభాగంలో హాజరుకాగా 5,425మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. అగ్రికల్చర్ ఫ్మార్మసీ విభాగంలో 2,557మంది హాజరుకాగా 2,269మంది అర్హులయ్యారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మొత్తం 3,040మంది విద్యార్థులు ఇంజనీరింగ్ వి భాగంలో హాజరుకాగా 2,330మంది ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 1,244మంది హాజరుకాగా 1,115మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.