పీలేరు పట్టణంలోని పలు ఎరువులు, క్రిమిసంహారక మందుల దుకాణాలలో మంగళవారం వ్యవసాయ శాఖాధికారులు తనిఖీలు నిర్వ హించారు. ఈ సందర్భంగా ఏడీ రమణరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన ప్రారంభం అయిన నేపథ్యంలో రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, క్రిమిసంహారక మందులు విక్రయించాలని, విక్రయాలన్నింటికీ విధిగా బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. సరైన బిల్లులు ఇవ్వని, అమ్మకాల రికార్డులు నిర్వహిం చని దుకాణుదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఏవో రమాదేవి, ఏఈవోలు నజీర్, ఇంద్ర, తదితరు లు పాల్గొన్నారు.