మంత్రిగా ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ బుధవారం పట్టణ బీజేపీ శ్రేణులు స్థానిక యాదవవీధిలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 13వ వార్డులో వంద మంది మహిళలకు దంపతుల చేతుల మీదుగా చీరలు పంపిణీ చేసినట్లు పట్టణ బీజేపీ అధ్యక్షుడు రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.