కొరిసపాడు మండలం పమిడిపాడు గ్రామంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహం నందు అడ్మిషన్లు ప్రారంభమైనట్లు వార్డెన్ శామ్యూల్ జాన్ గురువారం పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు. హాస్టల్ నందు విద్యార్థులకు అన్ని మెరుగైన సౌకర్యాలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే హాస్టల్ నందు అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందని శామ్యూల్ జాన్ తెలియజేశారు.