బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వలాపల్లి గ్రామంలో 2017–2018లో ఉపాధి హామీ నిధులు రూ.10 లక్షలతో గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మించారు. 2019లో దానిపై మొదటి అంతస్తు నిర్మించి, సచివాలయం ఏర్పాటు చేశారు. ఈ సచివాలయం శిలాఫలకాన్ని టీడీపీ నాయకులు ధ్వంసం చేశారు. గ్రామస్తులందరూ గ్రామాభివృద్ధికి బాటలు వేసుకోవాలే తప్ప శిలాఫలకాలు ధ్వంసం చేయడం సరికాదని గ్రామ సర్పంచ్ మందా మోహన్‌రావు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa