నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలో వైయస్ఆర్సీపీ ఆర్యవైశ్య సంఘం నాయకుడు పువ్వాడి భాస్కర్‌పై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. పట్టపగలే అందరూ చూస్తుండగా కర్రలతో దాడి చేసి గాయపరిచారు. అలాగే కొలిమిగుండ్ల మండలంలోని కల్వటాలలో టీడీపీ నాయకులు మినరల్ వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఎస్సీ కాలనీకి చెందిన వైయస్ఆర్సీపీ సానుభూతిపరులు పెసల ఏసోబు, యాడికి ఏబులపై కర్రలతో దాడి చేశారు. అలానే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రామాయపట్నం గ్రామ సచివాలయం భవనంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు బుధవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు.