పామూరు పట్టణంలో గురువారం వైద్య సిబ్బంది మలేరియా వ్యతిరేక మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది పట్టణంలోని ప్రధాన రహదారుల్లో తిరుగుతూ మలేరియా గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరంవారు మాట్లాడుతూ మలేరియా వ్యాధి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అజాగ్రత్తగా ఉంటే ప్రాణాలు పోతాయని హెచ్చరించారు. ఇంటి పరిసరాలలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు.