ఈ ఎన్నికలకు జస్ట్ రెండు నెలల ముందు నంద్యాలలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. పార్టీ కార్యాలయంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఓ అఘోరా ఆకస్మాత్తుగా కార్యాలయంలోకి వచ్చారు. దీంతో ఫరూక్తోపాటు అక్కడే ఉన్న పార్టీ కేడర్ ఒకింత విస్మయానికి గురయ్యారు. ఫరూక్ ముందు ఆ అఘోరా కూర్చునీ.. ‘ఈ ఎన్నికల్లో ఓ కష్టాన్ని దాటబోతున్నావ్.. నిన్ను ఎదురించే వారు ఎవరు లేరు. మంత్రి పదవి సైతం అందుకోబోతున్నావ్. అలాగే హిందువులు, ముస్లింలు సోదరభావంతో కలిసిమెలసి ఉంటారు’ అని చెప్పారు. అన్నట్లుగానే ఫరూక్ మంత్రి అయ్యారు. అఘోరాకు ముందుగానే ఎలా తెలిసింది..? అని జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇందుకు కు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.