మహానంది మండలంలోని నల్లమల అటవీ ప్రాంతంలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న చత్తీస్‌ఘడ్‌కు చెందిన పాండవ్ అనే మహిళపై చిరుతపులి దాడి చేసింది. గురువారం నల్లమలలోని గిద్దలూరు-నంద్యాల రైల్వే ట్రాక్ పరిధిలోని చలమ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మరమ్మతు పనులు కూలీలు చేస్తుండగా దాడి చేసింది. మిగతా కూలీలు కేకలు వెయ్యడంతో చిరుత పారి పోయింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయాలపాలైన ఆమెను తోటి కూలీలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి అటవీశాఖ ఉన్నతాధికార్లు చేరుకొని చిరుతపులి కోసం నల్లమలలో అన్వేషించారు.