ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు, వైయస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తుగ్గలి మండలంలోని డీసీకొండలోవైయస్ఆర్సీపీ కార్యకర్త శ్రీనివాసులుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వైయస్ఆర్సీపీ కార్యకర్త శేఖర్పైనా దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు జొన్నగిరి పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు