ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పుంగనూరులో హైటెన్షన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 06:38 PM

చిత్తూరు జిల్లాలోని పుంగనూరులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీంతో నియోజకవర్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజీనామా చేయాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లపైకి వచ్చి మరీ టీడీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నియోజకవర్గానికి వస్తున్న పెద్దిరెడ్డి అడ్డుకోవాలనే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే.. పెద్దిరెడ్డి గో బ్యాక్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com