మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ‘ప్రజాదర్బార్’ నిర్వహించనున్నారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనసును నారా లోకేష్ గెలిచారు. ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త వరవడికి శ్రీకారం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పారు. నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించారు.