నాసిరకం మద్యంతో ప్రజల ప్రాణాలు తీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని గనులు, భూగర్భ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. నేరానికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ చట్ట పరిధిలో శిక్షపడేలా చేస్తామన్నారు. మద్యం ధరలను అందుబాటులోకి తీసుకొస్తామని, నాసిరకం బ్రాండ్లను బ్యాన్ చేస్తామని తెలిపారు. వైసీపీ హయాంలో ఖనిజ సంపద దోచుకున్న పాలకులపై చర్యలుంటాయని హెచ్చరించారు.