రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు చేసిన తొలి ఐదు సంతకాలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తొలి అడుగులని కాకినాడ సిటీ ఎమ్మెల్యే విజేత వనమాడి కొండబాబు అన్నారు. స్థానిక జగన్నాథపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట చంద్రబాబు నిలబెట్టుకున్నార న్నారు. మొదటగా మెగా డీఎస్సీపై ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్లు రూ.4వేలకు పెంపు, అన్నక్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్యాభివృద్ధి ఫైల్స్‌పై తొలి ఐదు సంతకాలు చేయడం ఆనందకరమన్నారు. పెన్షన్ దారులు, న్యాయవాదులు, నిరుద్యోగులు, యువకులు ఎమ్మెల్యే కొండబాబుకు స్వీట్లు అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షుడు మల్లిపూడి వీరు, దండుప్రోలు నాగబాబు, చింతలపూడి రవి, అమలకంటి బలరామ్, లక్ష్మీప్రసన్న, లీగల్ సెల్ ప్రతినిధులు, యుటీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.