కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబుని ఆదివారం ప్రజావేదిక వద్ద ప్రభుత్వ ఉపాధ్యాయులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాలలో నాణ్యమైన విద్య అందించడానికి అన్ని రకాల సహకారాలు ప్రభుత్వం తరపున అందిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు మంచి ర్యాంకులు తెప్పించేందుకు కృషి చేయాలని సూచించారు.