ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం కోస్తా జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. కాకినాడ రూరల్‌లో 83, ఏలూరు జిల్లా నిడమర్రులో 80, విజయనగరంలో 70, అల్లూరి జిల్లా కూనవరంలో 48.5, తూర్పుగోదావరి జిల్లా గోపాలపురంలో 48.5, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 47.5, కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 31.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సోమవారం అల్లూరి జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
![]() |
![]() |