విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ అనకాపల్లి మోటార్ సైకిళ్ల మెకానిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ఎదురేశ్వరపు శ్యామలరావు (72) ఆదివారం మృతి చెందారు. ఈ మేరకు సోమవారం మృతుని సోదరుడు వీరబ్రహ్మం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ హెడ్‌కానిస్టేబుల్ ఆనంద్ తెలిపారు. శ్యామలరావు సబ్బవరం రోడ్డులోని సుంకరమెట్ట జంక్షన్ సమీపంలో నివాసం ఉంటున్నారు. ఈనెల ఎనిమిదో తేదీన పాము కాటేయడంతో అనకాపల్లిలో ప్రథమ చికిత్స అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శ్యామలరావు మృతి పట్ల అసోసియేషన్ సభ్యులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా మెకానిక్ దుకాణాలను సోమవారం మూసివేసి కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతిని తెలిపారు.
![]() |
![]() |