విశాఖ పరిధిలోని నక్కపల్లి మండలంలోని గొడిచెర్లలో ఈనెల 15న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకుడు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు. వివరాల్లోకి వెళ్ళితే..... గొడిచెర్ల గ్రామానికి చెందిన లోలి దుర్గారావు (18) గత కొన్ని రోజుల నుంచి బైక్ కొనమని తల్లిదండ్రులను అడుగుతున్నాడని వారు చెప్పారు. బైక్ కొనలేదని ఈనెల 15న పురుగుల మందు తాగి, ఇంటికి వచ్చి పడిపోగా తల్లిదండ్రులు తుని ప్రైవేట్ ఆస్పత్రికి, అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతి చెందినట్టు పోలీసులు చెప్పారు.
![]() |
![]() |