రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్ట సమీపంలో బైక్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో చెళ్ళికెరకు చెందిన తిప్పేస్వామి, భరత్ కుమార్, రమేశ్ అనే ముగ్గురు యువకులు గాయపడ్డారు. మంగళవారం రాత్రి రాయదుర్గం నుంచి చెళ్ళికెర వైపు వెళుతుండగా ఈప్రమాదం జరిగింది. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా అంబులెన్స్ అక్కడికి చేరుకుని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు.
![]() |
![]() |