ఏపీ బెవరేజెస్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. వైసీపీ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్న వాసుదేవరెడ్డి ఆ ప్రభుత్వం దిగిపోగానే హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో బేవరేజెస్ కార్పొరేషన్ కార్యాలయం నుంచి కీలక ఫైళ్లు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు చోరీ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. అయితే.. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వాసుదేవరెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం ఈ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా సీఐడీ తరఫు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
![]() |
![]() |