డోన్ పట్టణంలోని ఆర్టీసీ డిపో ఆవరణలో రెండు నూతన బస్సు సర్వీసులను ఎమ్మెల్యే కోట్ల సూర్యప్ర కాష్ రెడ్డి ప్రారంభించారు. డోన్ నుంచి తిరుపతి, విజయవాడ బస్సు సర్వీసులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ క్రమంలో పంచాయితీరాజ్, క్వాలిటీ కంట్రోల్ ఈఈ మల్లికార్జునమూర్తి, డోన్ పీఆర్ ఏఈ నారాయణ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సర్వశిక్ష అభియాన్ అధికారులు, విద్యుత్ శాఖ, అగ్నిమాపక శాఖ అధికారులు ఎమ్మెల్యే కోట్లను మర్యాదపూర్వకంగా కలిసి పూలబొకేలు అందజేసి సన్మానించారు. డోన్ నియోజకవర్గంలో గృహ నిర్మాణాలకు సంబంధించిన వివరాలను హౌసింగ్ ఈఈని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు తమ సమస్యలను విన్నవించుకున్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్ష్మిరెడ్డి, మర్రి రమణ, లక్ష్మినారాయణ యాదవ్, ఓంప్రకాష్ పాల్గొన్నారు.