ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కర్నూలు జిల్లా విద్యాధికారి సుధాకర్‌రెడ్డి కోరారు. బనగానపల్లె మండలంలోని ఇల్లూరు కొత్తపేట జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాలలో విద్యా ర్థులు, తల్లిదండ్రులతో కలసి నేను బడికి పోతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సేవలను వివరించారు. గత సంవత్సర పదో తరగతి పబ్లిక్ ఫలి తాలపై ప్రధా నోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించారు. పాఠశాలలో నిర్మాణంలో ఉన్న పాఠశాల గదిని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సోమశేఖర్‌రెడ్డి, సమగ్ర శిక్ష అధికారి రఘురామిరెడ్డి, ఉపాధ్యాయులు కుమార్‌బాబు పాల్గొన్నారు.
![]() |
![]() |