నైరుతి రుతుపవనాల ప్రభావంతో మంగళవారం చిత్తూరు జిల్లాలో వర్షం దంచేసింది. సోమవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం వరకు ఉరుములు, మెరుపులు, పిడుగులతో వర్షం కురిసింది. మంగళవారం ఒక్కరోజే జిల్లా అంతటా సరాసరి 31.9 మిమీ వర్షపాతం నమోదైంది. జూన్ నెల సగటు వర్షపాతం ఐరాలలో 91.6 మిమీ కాగా, మంగళవారం ఒక్కరోజే గరిష్ఠంగా 118.2 మిమీ నమోదైంది. అలాగే తవణంపల్లెలో 81.6 మిమీ బదులు 84.8, సోమలలో 66.1మిమీ బదులు 84.6, గంగాధరనెల్లూరులో 77.2 మిమీకి గాను 83.4 మిమీ వర్షం కురిసింది. జూన్ నెల జిల్లా సగటు వర్షపాతం 80.8 మిమీ నమోదు కావాల్సివుండగా, మంగళవారం నాటికే 138.8 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక మండలాల వారీగా... పులిచెర్లలో 66.2, పూతలపట్టులో 61.8, చౌడేపల్లిలో 60.2, చిత్తూరు అర్బన్‌లో 50.8, నగరిలో 50.4, పాలసముద్రంలో 44.2, కార్వేటినగరంలో 35.4, పెనుమూరులో 31.0, విజయపురంలో 30.2, రొంపిచెర్లలో 28.4, గంగవరంలో 28.4, బంగారుపాళ్యంలో 19.2, సదుంలో 18.2, పుంగనూరులో 17.4, యాదమరిలో 16.6, చిత్తూరు రూరల్‌లో 16.4, పెద్దపంజాణిలో 15.4, గుడిపాలలో 14.4, శ్రీరంగరాజపురంలో 9.2, బైరెడ్డిపల్లెలో 8.6, వెదురుకుప్పంలో 8.4, నిండ్రలో 8.2, పలమనేరులో 8.2, శాంతిపురంలో 2.0 మిమీ చొప్పున వర్షపాతం నమోదైంది.
![]() |
![]() |