దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి హాట్ స్పాట్‌గా ఉన్న 17 నగరాల్లో విశాఖపట్నం స్థానం సంపాదించుకుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కాలరీస్ ఇండియా దేశంలోని 100కు పైగా నగరాలను సర్వే చేసి అందులో ఎక్కువగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న 30 నగరాలను గుర్తించింది. అందులో 17 నగరాలైతే మరింత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ పదిహేడు నగరాల్లో రెండు ఆంధ్రప్రదేశ్ నుంచే ఉండడం విశేషం. అందులో ఒకటి తిరుపతి కాగా మరొకటి విశాఖపట్నం. ఆయా నగరాల్లో మౌలిక వసతులు మెరుగు పరచడానికి, అభివృద్ధికి అనుగుణంగా కొత్త ప్రాజెక్టులను అక్కడి ప్రభుత్వాలు చేపట్టడం వల్ల రియల్ ఎస్టేట్ రంగం విస్తరించనుందని సంస్థ విశ్లేషించింది. చక్కటి హోటళ్లు, రిటైల్ మార్కెట్లు కూడా దీనికి దోహదపడతాయని వెల్లడించింది.
![]() |
![]() |