టీడీపీ, జనసేన కార్యకర్తలకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి బిట్ర శివనారాయణ పేర్కొ న్నారు. మంగళవారం రాజంపేట పార్లమెంట్ సమీక్ష సమావేశం మదనపల్లె పార్టీ కార్యాలయంలో నిర్వ హించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శివనారాయణ మాట్లాడుతూ.... ఏపీలో భారతీయ జనతా పార్టీ ఓటుబ్యాంకు ఎన్డీఏ కూటమిగా పోటీ చేయడంతో విశేషంగా పెరిగందన్నారు. రాజంపేట పార్లమెంట్ పరిథిలో 1,40,000 ఓట్లు పెరగడం మోదీ పాలన వలనే అన్నారు. దురదృష్టమైన కారణాలతో తక్కువ ఓట్లతో రాజంపేట పార్లమెంట్ సీటు కోల్పోయామన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడుసాయిలోకేష్ మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్‌లో ప్రతి బూత లెవల్‌లో విశేషంగా కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట పార్లమెంట్ ఇంచార్జీ చంద్రమౌళి, నంధ్యాల పార్లమెంట్ ఇనచార్జీ పోతుగుంట రమేష్ నాయుడు, స్టేట్ కో ఆపరేటివ్ సెల్‌కన్వీనర్ గోపాల్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు ఎల్లంపల్లె ప్రశాంత, ఆకుల కృష్ణమూర్తి కృప్ణయాదవ్, ఆనందగజపతిరాజు, మదనప ల్లె పట్టణ అధ్యక్షుడు బర్నేపల్లె రవికుమార్, ఓ సూరి కిరణ్‌కుమార్, షబీర్ అహ్మద్, బాలజ్యోతి, అసెంబ్లీ కన్వీనర్లు భగవాన, పచ్చిపాల వసంతకుమార్, బండి ఆనంద్, జర్మనీరాజు, వేణుగోపాల్, పూలనాగరాజు, తదతరులు పాల్గొన్నారు.
![]() |
![]() |