ధర్మవరం మున్సిపాలిటీలోని ఎర్రగుంట కాలనీలో మరణించిన అనాథ శవానికి అంత్యక్రియలు జరిపినట్లు శ్రీ కృష్ణ చైతన్య భక్త భజన మండలి సభ్యుడు నాగరాజు బుధవారం పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్ కేతన్న విజ్ఞప్తి మేరకు. శ్రీ కృష్ణ చైతన్య భక్త భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ రథంలో ఉచిత సేవా కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనాథలు, పేదలకు ఉచిత సేవ నిర్వహించనున్నట్లు తెలిపారు.