ప్రకాశం జిల్లా పొదిలిలోని శ్రావణి ఎస్టేట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సమీపంలో సాగర్ నీటితో రోడ్డంతా జలామయమై పాదాచార్యులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న నగర పంచాయతీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గురువారం స్వయంగా పరిశీలించారు. ఎన్ఏపి పంప్ హౌస్ లో పంపింగ్ సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో నీరు పంపు చేయలేక వృద్ధాక పోతున్న విషయాన్ని తెలుసుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.