టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పుట్టిన రోజు నేడు. ఆమె జన్మదినం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ విషెష్ చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు.