అనపర్తి నియోజకవర్గంలో గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక రోడ్లు అధ్వాన స్థితికి చేరుకున్నాయని, వాటి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కలెక్టర్ మాధవీలతను కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నల్లమిల్లి కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే అనపర్తి నియోజకవర్గంలో అధ్వాన స్థితికి చేరుకున్న రోడ్ల పరిస్థితిని ఆమెకు వివరించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని అభివృద్ధి, నిర్వహణ పనులపై ఆయన చర్చించారు. ముఖ్యంగా కెనాల్ రోడ్డు దుస్థితిని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చానని, దీనికి ఆమె సానుకూలంగా స్పందించారని అన్నారు.