ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించే ఇంటర్ విద్యార్థులకు టీడీపీ కూటమి ప్రభుత్వం తీపికబురు అందించింది. అవసరమైన పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు, బ్యాగ్‌లు, యూనిఫారాలు, షూస్ ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 18న మంత్రి నారా లోకేష్ పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa