కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వం.. సరికొత్త పథకంతో విద్యార్థులను ఆదుకుంటోంది. విద్యార్థి దశలో ఎంతో కీలకమైన ఇంటర్ విద్యకు భరోసా ఇవ్వనుంది. ఒకటి నుంచి పదోతరగతి విద్యార్థులకు అందజేస్తున్న స్టూడెంట్ కిట్‌ను ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యార్థులకూ అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖామంత్రి నారా లోకేష్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా.. ఆ దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. జూలై నాటికి విద్యార్థులకు ఉచితంగా బ్యాగు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ పంపిణీ చేయనున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.