సీతంపేట ఐటీడీఏ పరిధిలో పనిచేస్తున్న సవర భాషా వలంటీర్ల సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి పడాల భూదేవి స్పష్టం చేశారు. గురువారం తన కార్యాలయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను భాషా వలంటీర్లు పడాల భూదేవికి విన్నవిం చారు. వైసీపీ ప్రభుత్వం తమను విధుల నుంచి తొలగించిందన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి రెన్యూవల్ చేసి కొనసాగించాలని వినతిపత్రం ఇచ్చి కోరారు. ఆమె మాట్లా డుతూ ఈ విద్యా సంవత్సరం సవరభాషా వలంటీర్లకు రెన్యూవల్ చేసి గౌరవవేతనం పెంచేదుకు చర్యలు చేపడ తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సవర ఆనందరావు, సవర డొంబు, ఆరిక నాగభూషణ్, ఎ.రాణి, వి.లక్ష్మి, వి.సుహాసిని, పి.సుందరరావు, బి.శివ, ఎ.బసవ రాజు, సవర కృష్ణ తదితరులు పాల్గొన్నారు.