కొండాపురంలోని పలు సమస్యలు పరిష్కరించలేదని శుక్రవారం ఏఐటీయూసీ నాయకులు వాపోయారు. ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ, సుబ్బారావు మాట్లాడుతూ. పాత ఊరిలో జడ్పీ హైస్కూల్, ఎమ్మార్వో ఆఫీస్, వెటర్నరీ హాస్పిటల్, లైబ్రరీ ఇవన్నీ పాత భవనాల్లోనే కొనసాగిస్తున్నారు. నూతన బైపాస్ రోడ్డులో బస్టాండు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి దారి, వీటి సమస్యలను అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని వారు కోరారు.