ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నియోజకవర్గ ప్రజలు కోసం ప్రతిఒక్క నేత పనిచేయాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2024, 04:07 PM

పొత్తులో భాగంగా ఎవరైతే సీటు ఆశించి,రాకపోయినా కూటమి కోసం ప్రతి ఒక్కరూ పని చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి వివరించారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీల కలయిక సమాజం కోసం పుట్టిన పార్టీలని చెప్పారు. ‘సబ్ కా సాత్, సబ్ కా వికాస్’ నినాదంతో దేశ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మూడు పార్టీల నినాదంతో ఒక్కటై రాష్ట్ర అభివృద్ధికి అవసరమని ప్రజలు గమనించారన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమ పాలన అందించటానికి కూటమి ముందుకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు శ్రీకారం చుట్టారని ఉద్ఘాటించారు. ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో అది నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్వర్తించేలా కృషి చేస్తుందని వివరించారు. కూటమిలో ఉన్న ప్రజా ప్రతినిధులు, ఓటమి చెందిన నేతలు కానీ వారి నియోజకవర్గ ప్రజలు కోసం పని చేయాలని కోరారు. దేశ అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్ర బీజేపీ నాయకులు అమిత్ షా, మోదీ ఆశయాలు ఏమైతే ఉన్నాయో వాటి కోసం నిరంతరం కృషి చేస్తారని మాటిచ్చారు.గెలుపు కోసం కష్ట పడిన ప్రతి కార్యకర్తకు దగ్గుబాటి పురందేశ్వరి ధన్యవాదాలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com