గ్రామాల్లో జ్వర లక్షణాలు ఉన్న ప్రతిఒక్కరికీ సత్వరమే క్షేత్ర స్థాయిలో నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని విజయనగరం జిల్లా మలేరి యా అధికారి డా.టి.జగన్మోహన్‌రావు సిబ్బందిని ఆదేశిం చారు. కొమరాడ మండలంలోని చినఖేర్జిల గ్రామాన్ని ఆయన గురువారం సందర్శించి, వైద్య శిబిరాన్ని పరిశీలించారు. జ్వర లక్షణాలతో ఉన్న వారికి నిర్వహించిన మలేరియా ఆర్డీటీ నిర్ధారణ పరీక్షలు, ఫలితాలను పరిశీలించారు. జ్వర లక్షణాలు ఉన్నవారికి, తగు మందులు అందజేయాలని సూచించారు. ప్రస్తుతం సీజనల్ జ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పీహెచ్‌ఎన్ విజయకుమారి, సూపర్‌వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది అనిల్, మంగమ్మ, రమేష్, ఆశ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.